గంటా శ్రీనివాస్‌ రాజకీయ వ్యాపారి

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజకీయ వ్యాపారి అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. తన పదవి కోసం నమ్మినవాళ్లను ముంచిన చరిత్ర గంటా శ్రీనివాస్‌దని ధ్వజమెత్తారు. ఇతర పార్టీలో ఆఫర్‌ ఉందని చెప్పడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో కనిపించని గంటా ప్జలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదవులు శాశ్వతం కాదని, సేవ ముఖ్యమని సూచించారు.
 

Back to Top