మౌలానా అబుల్‌ కలామ్ ఆజాద్ సేవ‌లు అజ‌రామ‌రం

మౌలానా అబుల్‌ కలామ్ ఆజాద్‌  జయంతి సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మైనార్టీ  సంక్షేమ‌, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌

తాడేప‌ల్లి: భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్ ఆజాద్ దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా అందించిన సేవ‌లు అజ‌రామ‌రం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. ఇవాళ మౌలానా అబుల్ క‌లామ్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్‌ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మైనార్టీ  సంక్షేమ‌, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

జ‌యంతి కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌ ఖాదర్‌ బాషా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, మైనారిటీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్‌ ఆసిఫ్‌, మెహబూబ్ షేక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top