‘మావిగన్’ దెబ్బకు చంద్రబాబు గ్రాఫిక్స్ కోటలు బద్ధలు

వైయస్.జగన్ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృత చర్చ

పక్కదారి పట్టించేందుకు ఆడబిడ్డలపై నీచపు రాతలా?:

ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ తెనాలి ఇన్ ఛార్జి అన్నాబత్తుని శివ కుమార్. 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ ఛార్జి అన్నాబత్తుని శివ కుమార్.

12 ఏళ్లుగా రాజధాని పేరుతో రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు

వైయస్. జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై ప్రజల్లో అనూహ్య స్పందన.

చంద్రబాబు చెప్పే రూ.2 లక్షల కోట్ల ఖర్చులో 10 శాతంతో మావిగన్ 

మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి

మావిగన్' ఒక గ్రోత్ ఇంజిన్.

స్పష్టం చేసిన అన్నాబత్తుని శివకుమార్

రాజధాని చర్చను డైవర్ట్ చేయడానికే నీచపు రాతలు

వైయ‌స్ఆర్‌సీపీ  నేతల పై వ్యక్తిత్వ హననం 

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు:

మండిపడ్డ  శివ కుమార్ 

సెంటిమెంట్ పేరుతో ఎల్లకాలం మోసం చేయలేవు బాబూ

రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్లు అప్పు.

అమరావతిలో పనుల్లేవు, ప్రజలకు సంక్షేమమూ లేదు

ఉన్నదల్లా కూటమి నేతల దోపిడీ మాత్రమే

తేల్చి చెప్పిన అన్నా బత్తుని శివ కుమార్ 

తాడేపల్లి: "ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను, భూములిచ్చిన రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత అన్నాబత్తుని శివ కుమార్ ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదనపై జనాల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు చెప్పే రూ. 2 లక్షల కోట్ల అప్పుల రాజధాని కంటే, కేవలం 10 శాతం ఖర్చుతో సాకారమయ్యే ‘మావిగన్’ అత్యంత లాభదాయకమని విద్యావంతులు, సామాన్యులు చర్చిస్తుండటం కూటమి నేతలకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు. ఈ వాస్తవ చర్చను డైవర్ట్ చేయడానికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబ సభ్యులు, మహిళలపై నీచమైన రాతలు రాయిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను గాలికొదిలేసి, రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు.. సెంటిమెంట్ పేరుతో ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడతారని శివ కుమార్ నిలదీశారు." ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

12 ఏళ్ల మోసం – రూ. 2 లక్షల కోట్ల భారం..

కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా... రాజధానిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రపంచ స్థాయి నిర్మాణాలు లేవు, కేవలం గ్రాఫిక్స్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. "ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన 50 వేల ఎకరాల భూముల్లో మౌలిక వసతులకే లక్ష కోట్లు కావాలి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 50 వేల ఎకరాలు సేకరిస్తామంటున్నారు. మొత్తం లక్ష ఎకరాల రాజధాని అంటే రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఈ భారీ ఆర్థిక భారం రాష్ట్ర ప్రజలపై పడడమే కాకుండా, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 40 ఏళ్లు పడుతుంది. ఇది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు". 

‘మావిగన్’ – తక్కువ ఖర్చుతో అద్భుతమైన వృద్ధి..

వైయస్. జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ప్రతిపాదనపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "చంద్రబాబు అమరావతి కోసం చెబుతున్న రూ.లక్షల కోట్ల ఖర్చులో కేవలం 10 శాతంతోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చు. ఇప్పటికే 45 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుంది. ఈ తక్కువ ఖర్చు-ఎక్కువ ప్రయోజనం అనే ఆలోచన సామాన్యులు, విద్యావంతులు మరియు మహిళల్లో బాగా రిజిస్టర్ అయ్యింది. అందుకే కూటమి నేతల్లో కంటగింపు మొదలైంది". 

నీచమైన రాతలు – డైవర్షన్ పాలిటిక్స్..

మావిగన్ ప్రతిపాదనకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనా వారి కుటుంబసభ్యులు, మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. "ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్‌లో వాడిన భాష అత్యంత దిగజారుడుతనంగా ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడటం ద్వారా మావిగన్ చర్చను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. రాధాకృష్ణ గతంలో అసెంబ్లీ కారిడార్లలో చిన్న విలేకరిగా తిరిగి, నేడు బ్లాక్ మెయిలింగ్‌తో వేల కోట్లు సంపాదించారని మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చెప్పిన మాటలు అక్షర సత్యం". 

విఫలమైన కూటమి హామీలు – అప్పుల కుప్పగా ఏపీ..

రాజధాని పేరుతో సెంటిమెంట్ రగిలిస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. "రెండేళ్ల కూటమి పాలనలో రూ. 3.50 లక్షల కోట్లు అప్పు చేశారు. సూపర్ సిక్స్ హామీలు ఎటుపోయాయి? నిరుద్యోగ భృతి లేదు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు లేవు, మహిళలకు రూ. 1500 ఊసే లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవాటిలో కోతలు పెడుతున్నారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం అమరావతిని ఆదాయ మార్గంగా మార్చుకోవాలని చూస్తున్నారు".  వైయస్.జగన్ సూచించిన మావిగన్ కచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది మా పార్టీ అభిప్రాయం మాత్రమే కాదు ప్రజాభిప్రాయం కూడా. దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయడానికి అమరావతి మీద మాట్లాడకుండా..  సెంటిమెంట్ జోడించే ప్రయత్నం చేస్తున్నారు. 

మావిగన్‌పై వాస్తవ చర్చ జరగాలి.. 
సెంటిమెంట్ పేరుతో అమరావతిని కేవలం ఆదాయ మార్గంగా మార్చుకుంటూ, లక్షల కోట్ల అప్పుల భారాన్ని భవిష్యత్ తరాల నెత్తిన వేయవద్దన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, హామీల అమలులో విఫలమై, కేవలం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న కూటమి నేతలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని శివకుమార్ హెచ్చరించారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వైయస్ .జగన్ సూచించిన 'మావిగన్' ప్రతిపాదనను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు."

Back to Top