నిమ్మగడ్డ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ప్రకాశం: సీనియర్‌ నాయకులు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ ఆంక్షలు సరికాదని, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ నిర్ణయాలు మొదట్నుంచి వివాదాస్పదంగానే ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్‌మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిపైనే ఆంక్షలు పెట్టడం.. భావవ్యక్తీకరణను అడ్డుకోవడమేనని దుయ్యబట్టారు. మంత్రుల హక్కులకు ఎస్‌ఈసీ భంగం కలిగిస్తుందని, దీనిపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారన్నారు. ఆ ఫిర్యాదును స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారని, ప్రివిలేజ్‌ కమిటీ అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Back to Top