సంక్షేమ పాలనకు పరిషత్‌ ఫలితాలు నిదర్శనం

సీఎం వైయస్‌ జగన్‌ను ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారు

ఘోర ఓటమిని ముందే గ్రహించి చేతులెత్తేసిన చంద్రబాబు..

తండ్రీకొడుకులు హైదరాబాద్‌కు పరిమితమైతేనే మంచిది

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అయ్యన్న పాత్రకు సొట్టలుపెడతాం

అచ్చెన్నకు దమ్ముంటే 19 మందితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ సవాల్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పరిపాలనకు స్థానిక సంస్థల ఫలితాలు నిదర్శనమని, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలకు కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజల్ట్‌ వస్తుందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రజాతీర్పు సుస్పష్టంగా కనిపిస్తుందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం ప్రతిబింబిస్తుందన్నారు. ఎన్నికలను బైకాట్‌ చేశాం కాబట్టే వైయస్‌ఆర్‌ సీపీ గెలుస్తుందని మాట్లాడే తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. పంచాయతీ, మున్సిపల్‌ కంటే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే చేతులు ఎత్తేసి పారిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫలితాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని చెప్పుకునే అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్‌ కుమార్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. తెలుగుదేశం పార్టీతో ప్రస్తుతం ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించి.. గెలిపించుకునే దమ్మూ, ధైర్యం, సిగ్గు, శరం ఉందా..? ఉంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ''దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాజకీయ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్లుగా ఏ మంచి కార్యక్రమం చేపట్టాలనుకున్నా.. వాటిని అడ్డుకోవాలని చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేశారు. మీడియా ద్వారా విషం చిమ్మారు. అయినా.. అన్నింటినీ ఎదుర్కొని సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను ప్రజలంతా నమ్మకంతో గుండెల్లో పెట్టుకున్నారు. 

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కేవలం హైదరాబాద్‌కు పరిమితమైతే మంచిది. తండ్రీకొడుకులు ఏపీకి వస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం తప్ప.. ప్రజలకు మంచి చేయాలని ఏరోజు అయినా ఆలోచన చేశారా..? ఏపీలో అడుగుపెట్టి మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ఏమీ లేదు. మీడియాను అడ్డంపెట్టుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా, నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూసినా.. రాష్ట్ర ప్రజలంతా ఒక నిబద్ధతతో సీఎం వైయస్‌ జగన్‌ వెంట నిలబడ్డారు. మున్సిపల్‌ చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతానికి పైగా కేటాయించడం, మహిళలకు పెద్దపీట వేశాం. 

ఏకగ్రీవాలన్నీ పోలీసులను పెట్టుకొని చేయించారని మాట్లాడేందుకు అచ్చెన్నాయుడికి సిగ్గు అనిపించడం లేదా..? నామినేషన్‌ వేసి గతిలేని పార్టీ టీడీపీ.. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లను అడ్డుపెట్టుకొని ఒక్క నామినేషన్‌ ఎందుకు వేయలేకపోయారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలేదు. నామినేషన్‌ వేసే దిక్కులేక పోలీసులను అడ్డంపెట్టుకొని ఏకగ్రీవాలను చేసుకున్నామని సిగ్గులేకుండా మాట్లాడుతారా..? ఆరోజు నిమ్మగడ్డ మీ మనిషేగా, ఆంధ్రజ్యోతి, మరోనాలుగు అడ్డమైన మీ ఛానళ్లను తీసుకెళ్లి నామినేషన్‌ వేసి ఉండొచ్చు కదా..? 

ఎన్నికల తీర్పు వస్తుందని తెలిసే మూడు రోజుల ముందునుంచే వెధవ ప్రచారానికి చంద్రబాబు తెరతీశాడు. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే.. మాకు భాష రాదనుకున్నావా..? సంస్కార హీనుడిలా మాట్లాడుతావా అయ్యన్నపాత్ర..? పాత్రకు సొట్టపెట్టినట్టు నీకు సొట్టలు పెడతాం గుర్తుపెట్టుకో.. మేము తిట్టలేమా..? లఫూట్‌ నా కొడకా అని, చేతగాని నా కొడకా అని, పుచ్చపగిలిపోద్ది నా కొడకా అని మేము తిట్టలేమా..? కానీ, మాకు సంస్కారం ఉంది. తిట్టే భాష మాకు కూడా వచ్చు.. తిట్టలేక కాదు. మాకు మా నాయకుడు సంస్కారం నేర్పారు.  

సీఎం వైయస్‌ జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. నిజంగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ కన్నె్రర చేస్తే మీరు తిరగలరా..? ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోంది. చూపించే టీవీలు ఉన్నాయని, సోషల్‌ మీడియా ఉందని అడ్డమైన కూతలు కూస్తే ఊరుకోం. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేం కూడా మాట్లాడగలుగుతాం. పాత్రకు సొట్టపెట్టినట్టు పెట్టగలుగుతాం’’ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు.  

 

Back to Top