స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌
 

కర్నూలు: ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీదే విజయమని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్‌కు సంబంధించి వైయస్‌ఆర్‌ సీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ 60 శాతం రిజర్వేషన్‌ పాటిస్తుందన్నారు. కర్నూలులో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు,జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి అనిల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో 59.85 రిజర్వేషన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి బిర్రు ప్రతాప్‌రెడ్డితో కోర్టులో కేసు వేయించి బీసీలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబుపై మంత్రి అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కోర్టు తీర్పును గౌరవించి 50 శాతం రిజర్వేషన్‌కే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభ్యర్థులుగా నిలబెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. రిజర్వేషన్‌ను కోర్టులో టీడీపీ అడ్డుకున్నా.. పార్టీ పరంగా వారికి ప్రాధాన్యత కల్పించాలని సీఎం సూచించారన్నారు. ఈ విధంగా 60 శాతం సీట్లు కేటాయించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం 50 శాతం రిజర్వేషన్‌ను పాటిస్తూ.. రాజ్యసభ అభ్యర్థుల్లో కూడా రెండు సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తన బలాన్ని చూపించాలని మంత్రి అనిల్‌ సవాల్‌ విసిరారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో.. ప్రజలకు ఎవరిపై అభిమానం ఉందో.. ఇంకో 20 రోజుల్లో తేలిపోతుందన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచేందుకు వీల్లేదని సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ మద్యం, డబ్బు పంపించి ఆధారాలతో పట్టుబడితే గెలిచినా కూడా ఆ అనర్హత వేటు పడడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌దన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని సీఎం ఆలోచన చేశారని, ఆ ప్రకారమే పోలీసులు, అధికారులకు ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నిల్లో కర్నూలులో ఏ విధంగా క్లీన్‌స్వీప్‌ చేశామో.. అదే విధంగా స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

 

Back to Top