సత్తెనపల్లి: పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు.. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని నారా లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, రాజకీయాల్లో బఫూన్ లోకేష్ అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ఒక రోజులో ముగించేశాడు.. సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. తన స్థాయికి మించి మాట్లాడి ఒక వికృతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే లోకేశ్.. ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడు. నారా లోకేశ్ బతుకేంటి..? పాఠాలు చెప్పటానికి వచ్చిన టీచర్లను ఏం చేశాడో తెలియదా..? అని మంత్రి అంబటి చురకలు అంటించారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. నేను చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా..రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. కానీ లోకేశ్ వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే, ఒక మంత్రిగా ఉండగానే ఓడిపోయాడు. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారు. రాజకీయాల్లో బఫూన్ నారా లోకేశ్. తెలుగు మాట్లాడటమే రాదు. డెంగ్యూ అనమంటే బూతులు మాట్లాడతాడు.. ప్రశాంతతను కూడా ప్రశాంతి అత్తను చేశాడు. బీసీల సమావేశంలో బీసీ సోదరులకు బదులు బీసీ చౌదరులు అంటాడు. వైశ్యులను వైశాలి అంటున్నాడు. మొన్న మాచర్లకు వెళ్లి మాచల్ల అంటాడు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు..మాట్లాడం కుదరదు..తెలుగు మాట్లాడటం అసలు కుదరదు. అలాంటి వ్యక్తి నన్ను విమర్శిస్తున్నాడు. దిగజారి విమర్శలు చేస్తున్నాడు. నీ బతుకేంటో చూసుకో లోకేశ్.. పగలు వాగుతాను..రాత్రి గోకుతాను అంటున్నాడు. నీ గురించి, మీ నాన్నను, మీ అన్న పవన్ కల్యాణ్ గురించి కూడా వాగుతా.. అది మీకు వాగుడుగా అనిపించొచ్చు. కానీ ఎవరిని గోకాను..? గోకినొళ్లు వచ్చి నీకు ఏమన్నా చెప్పారా..? నారా లోకేశ్ అసలు నీ బతుకేంటి..? నీకు పాఠాలు చెప్పటానికి వచ్చిన టీచర్లను నువ్వేం చేశావో తెలియదా..? అవును నేను డ్యాన్స్ వేసింది నిజమే. నేనమన్నా క్లబ్‌లో డాన్స్ వేశానా..? స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ వేశానా..? అమ్మాయిలను అడ్డం పెట్టుకుని డాన్స్ చేశానా..? నా నియోజకవర్గంలో సంక్రాంతి రోజున అందరితో కలిసి ఆనంద నృత్యం చేశా. బోగి మంట వేసుకుని గిరిజనులు చేస్తున్న నృత్యంలో కలిసి డాన్స్ చేశా. ఇంత బఫూన్‌గా వ్యవహరిస్తున్న నువ్వు నన్ను విమర్శిస్తున్నావు. రాజకీయంగా సరైన విమర్శలు చేయలేని పరిస్థితుల్లోనే నువ్వూ మీ నాన్న ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. మీ నాన్న ఆంబోతు రాంబాబు అంటాడు.. నువ్వేమో కాంబాబు అంటావు. మీ జీవితాలు గురించి నేను మాట్లాడితే మీరు ఏమవుతారు..? నువ్వు, మీ నాన్న బావురుమంటూ ఏడుస్తారు. నీ మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు హైదరాబాద్‌లో ఏడుస్తారు. మీ నాన్నకు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని చెప్పా. ఇంకా విడమరచి బ్రోకరిజం చేశాడని చెప్పాలా..? నేను కాదు ఈ మాట అన్నది.. మీ తాతే మీ నాన్న గురించి అలా చెప్పాడు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, సింబల్ ను లాక్కోవడానికి మీ నాన్న ఎన్నెన్ని పనులు చేశాడో చెప్పాలా..? తెనాలి రామకృష్ణుడు సత్తెనపల్లిలో పుట్టాడా..? నేను రేపల్లెలో ఆస్థులు అమ్మి నేను ఇక్కడ పొలం కొనుక్కున్నా. రాజకీయాల్లో ఇక్కడే గడపాలి అని 18 ఎకరాలు కొనుక్కుంటే వందలాది ఎకరాలు అంటాడు. వావిలాల గోపాలకృష్ణయ్య, కోడెల శివప్రసాద్‌లకు సత్తెనపల్లికి సంబంధం ఉంది ఓకే. తెనాలి రామకృష్ణుడు సత్తెనపల్లిలో పుట్టాడా..? తెలుసుకుని మాట్లాడవయ్యా. అతను మాట్లాడుతుంటే పక్కన నిల్చున్న వారన్నా చెప్పాలి కదా..? ఇలాంటి బఫూన్ గాడు ఏదేదో మాట్లాడుతుంటే బొడ్డూడని బుడ్డోడు పక్కన కూర్చున్నట్టు పక్కనున్న పెద్దలంతా అలానే చూస్తే ఎలా..? ఆ బఫూన్ వెంట తిరగడానికి మీరు సిగ్గు పడాలి. అతను తప్పు మాట్లాడుతుంటే తప్పు అని చెప్పే ధైర్యమే చేయడం లేదు. నీ యాత్ర కుప్పంలో ప్రారంభం అయినప్పుడే చెప్పా.. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. ఇతను సీరియస్ పోలిటీషయన్ కాదు..మళ్లీ మళ్లీ ఓడిపోవడం ఖాయం. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైయస్సార్సీపీనే అని వాళ్లకి కూడా తెలుసు. అందుకే ఫ్రస్టేషన్లో బాబు, కొడుకు, దత్తపుత్రుడు తలోపక్క తిరుగుతున్నారు. సత్తెనపల్లిలో జరిగిన యువగళం అట్టర్ ఫ్లాప్. ఈ లోకేశ్ వస్తే 1500 నుంచి 2000 మంది వచ్చారు. వైయస్ జగన్ కాలి గోటికి కూడా సరిపోని కన్నా.. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కుటుంబ సభ్యుడ్ని పెట్టుకున్నానని ఆరోపిస్తున్నాడు. మొన్న మా తమ్ముడు అన్నారు.. ఇప్పుడు మా అల్లుడు వచ్చాడట. ఎవరో సన్నాసి స్లిప్ రాసిస్తే ఈ సన్నాసి లోకేశ్ చదువుతున్నాడు. నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితే లేదు. ఎన్నికలప్పుడు వారు వస్తారు.. ఎన్నికల ప్రచారం చేసుకుని వెళ్లిపోతారు. తండ్రికి చెడ్డపేరు తెస్తున్నాడని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నాడు. వైయస్ జగన్ తండ్రి పేరును మరింత ముందుకు తీసుకెళ్తున్న కుమారుడు ఆయన. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కానీ వైయస్ జగన్‌లా పట్టుదలతో రాజకీయాలు చేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి అయిన వారెరవరైనా ఉన్నారా..? వైయస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా చేసిన కన్నా ఇవన్నీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వైయస్ జగన్ కాలి గోటికి కూడా పనికి రాని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు పరిగెత్తే వ్యక్తి కన్నా. సత్తెనపల్లి వచ్చి కన్నాను గెలిపించండి అని లోకేశ్ అనలేకపోతున్నాడు. ఎవరూ యువగళాన్ని సీరియస్‌గా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. తిట్టడం కాదయ్యా.. ఒక సారి గెలవవయ్యా..? లోకేశం.. బోకేశం.. నువ్వు ఎన్ని మాట్లాడినా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు నేనంటే ఏంటో తెలుసు. లోకేశా..బోకేశా..అతని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఈ బోకేశ్ రెచ్చగొడుతుంటే వారి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రాజెక్టు పర్యటనతో వర్షాలు ఆగాయి చంద్రబాబు ప్రాజెక్టు బాట పట్టాడో లేదో.. వర్షాలు తగ్గిపోయాయి. అన్ని రిజర్వాయర్లు నిండుతాయి అనుకుంటే వర్షాలు లేకుండా పోయాయి. రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా దూషణ, భూషణలు చేసి విషం చిమ్మడం ద్వారా రాజకీయాల్లో కనిపించాలని చూస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురు కలిసి వచ్చినా, ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా వైయస్ జగన్‌ని ఓడించడం వారికి సాధ్యం కాదు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి ఆబద్ధాలు.. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టడం కాదు...లోకేశ్ లాంటి తెలుగును ఖూనీ చేసే లాంటి వారు పుడతారు. అబద్ధాలు ఎక్కువ ఆడారా.. ఎందుకూ పనికి రాని అసమర్ధులైన కుమారులు పుడతారు. దానికి ఉదాహరణ చంద్రబాబే. చంద్రబాబు జీవితం అంతా అబద్ధాలు ఆడారు...అందుకే లోకేశ్ లాంటి బిడ్డలు పుట్టారు. సవాల్ చేయడం- పారిపోవడం చంద్రబాబుకు అలవాటే. తాను పోలవరంలో 72 శాతం పూర్తి చేశాను అంటున్నాడు.. నేను 48 శాతం మాత్రమే చేశారు అంటున్నా. నేను చర్చకు సిద్ధమే. చంద్రబాబును రమ్మని అడుగుతున్నా. అలా చర్చకు రాడు.. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పెద్ద పెద్ద రంకెలు వేస్తూ, అరుస్తూ ఉంటాడు. వీరి పర్యటనలను, వీరి అబద్ధాల మాటలను రాష్ట్ర ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు`` అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.