ఈసారి కుప్పంతో కలిపి 175  సీట్లు గెలుస్తాం

మంత్రి అంబటి రాంబాబు ధీమా  
 

తాడేపల్లి:151 సీట్లు కాదు..ఈసారి కుప్పంతో కలిపి 175 గెలుస్తామని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్‌షాప్ నిర్వ‌హిస్తున్నారు. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  ప్రజల్లోకి మరింత ఉదృతంగా వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నెలకు 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం చెప్పారని అన్నారు. ఫిర్యాదులు వస్తే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పారని తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. రూ. లక్షా 50 వేల కోట్ల నిధులు నేరుగా ప్రజల్లోకి వెళ్లాయని స్పష్టం చేశారు. 
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top