నిజమే.. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు

చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్‌ట్రా ప్లేయర్

మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలు అన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని మంత్రి అన్నారు. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు?? చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు. తులసి నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాను అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నిన్న కర్నూలు రోడ్ షోలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 
 
 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశాడు? చంద్రబాబు క్రికెట్ టీం లో కోహ్లి లాంటి వాడు కాదు కదా. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్‌ట్రా ప్లేయర్. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయి. అధికారం కోసం భార్యను కూడా బజారుకు లాగుతున్నాడని మంత్రి అమ‌ర్‌నాథ్ విమర్శించారు .

 

Back to Top