గుంటూరు: నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌తో కలిసి మంత్రి సురేశ్ ఇవాళ ఆన్‌లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భవిషత్తు కోసం ఆన్‌లైన్ విధానం తప్పనిసరి అని తెలిపారు. ఆన్‌లైన్ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని వివరించారు. సీఎంతో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారు. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చు అని అభిప్రాయపడ్డారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదన్నారు. పిల్లలకు కొవిడ్ సోకితే ఆ పాఠశాల మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. కొన్ని యూనివర్సీటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి సురేశ్ అన్నారు. టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయాలని.. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల అభివృద్ధికి టీటీడీ నుండి నిధులు మంజూరు చేయమని మంత్రి ఆదిమూలపు సురేష్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు.