టీడీపీ సభ్యులు సభా మర్యాదలు పాటించాలి

ఆటో డ్రైవర్లకు మంచి చేస్తామంటే టీడీపీ ఓర్వలేకపోతుంది

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

అమరావతిః చక్కగా జరుగుతున్న సభను టీడీపీ సభ్యులు గందరగోళ పరుస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు.ఆటోడ్రైవర్లకు మంచి జరుగుతుందని చెప్తుంటే టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు.ఆటోడైవర్లకు మంచి చేస్తామంటే టీడీపీ ఓర్వలేకపోతుందన్నారు. టీడీపీ సభ్యుల వైఖరిని ఖండించారు.టీడీపీ సభ్యులు సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నోత్తరాల్లో మంత్రి పేర్ని నానిపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలను తప్పుబట్టారు.టీడీపీ సభ్యులు సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు.
అచ్చెన్నాయుడు సభలో హుందాగా  వ్యవహరించాలిః శ్రీకాంత్‌రెడ్డి
టీడీపీ సభ్యులు వాఖ్యలపై ప్రభుత్వ చిఫ్‌ విప్‌ గడికోట  శ్రీకాంత్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.అచ్చెన్నాయుడు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు.అచ్చెన్నాయుడు సభా మర్యాదలు మరిచిపోయారని ధ్వజమెత్తారు.అచ్చెన్నాయుడు బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.స్పీకర్‌ పట్ల కూడా  అమర్యాదగా ప్రవర్తిసున్నారని తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top