తాడేపల్లి: రాజధానికి భూములివ్వడం వల్లనో లేదా ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్లనో ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న అమరావతి పరిధిలోని ప్రతి బాధిత రైతుకీ వైయస్ఆర్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అండగా ఉండి వారి పక్షాన పోరాటం చేస్తుందని మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, కమిటీ సభ్యుడు దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు జరిగిన సమావేశానికి తుళ్లూరు మండలం నుంచి కూడా బాధిత రైతులు హాజరయ్యారని చెప్పారు. తుళ్లూరు ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు ప్రభుత్వం తన 12 ఎకరాల భూమిని ఇవ్వాలని వేధిస్తున్న అంశాన్ని కమిటీ ముందు చెప్పుకుని హృదయవిదారకంగా విలపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు కమిటీని తమ గ్రామానికి రావాలని ఆహ్వానిస్తున్నారని, త్వరలోనే నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి కలుస్తామని చెప్పారు. తమను ఆశ్రయించిన ప్రతి బాధిత రైతుకి వైయస్ఆర్‌సీపీ న్యాయ సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. - రైతులు కాదని నిరూపిస్తే రూ. లక్ష "ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూసేకరణకు తమ పొలాలు ఇవ్వడం ఇష్టం లేక, ప్రభుత్వం పెడుతున్న వేధింపులను చెప్పుకుని సహాయం కోరేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరిస్తూ వందల యూట్యూబ్ ఛానెళ్లలో వాళ్లు రైతులే కాదని పథకం ప్రకారం ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. కడుపుకి అన్నం తినేవారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. వారందరికీ నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా.. వైయస్ జగన్ గారిని కలిసిన వారు రైతులు కాదని నిరూపిస్తే వారికి లక్ష రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకానీ ఎండనగా వాననకా ఆరుగాలం పనిచేసే రైతులను వికృత రాజకీయాల కోసం అవమానించడం తగద" ని ఆయన హితవు పలికారు. సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో సభ్యులు మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, అడ్వకేట్లు జె. సుదర్శన్‌రెడ్డి, కె.శ్రీనివాస్, అమరావతి రాజధాని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - రైతులను రైతులే కాదని అవమానిస్తున్నారు ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూసేకరణకు తమ పొలాలు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పినా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో తమ కష్టాలను చెప్పుకుని సహాయం కోరేందుకు గత వారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరిస్తూ వందల యూట్యూబ్ ఛానెళ్లలో వాళ్లు రైతులే కాదని పథకం ప్రకారం ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. కడుపుకి అన్నం తినేవారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. వారందరికీ నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా.. వైయస్ జగన్ గారిని కలిసిన వారు రైతులు కాదని నిరూపిస్తే వారికి లక్ష రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకానీ ఎండనగా వాననకా ఆరుగాలం పనిచేసే రైతులను వికృత రాజకీయాల కోసం అవమానించడం తగదు. కూటమి ప్రభుత్వమే భూదాహంతో రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఈ నాలుగు గ్రామాలు మాత్రమే కాదు.. అందరూ బయటకు చెప్పుకోలేకపోయినా రాజధానికి భూములిచ్చిన ప్రతి రైతూ తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నాడు. దాదాపు పన్నెండేళ్ల క్రితం ల్యాండ్ పూలింగ్‌కి భూములిచ్చిన రైతులకు ఒక్కరికైనా డెవలప్ చేసిన ప్లాట్ ఇవ్వకుండా మోసం చేసింది కాకుండా, భూసేకరణకు భూములివ్వమని ఎదురుతిరిగిన రైతులతో మాట్లాడి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన ప్రభుత్వమే ప్రభుత్వమే వారిపై కక్ష పెంచుకోవడం సిగ్గుచేటు. రైతులు కన్నెర్ర చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో వారి ఊహకే వదిలేస్తున్నా. రైతులను వేధించిన ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి కాబట్టే ఈవిధంగా రైతులను క్షోభకు గురిచేస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు వైయస్ఆర్‌సీపీ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. నష్టపోయిన ప్రతిరైతుకి వైయస్ఆర్‌సీపీ అండగా ఉండి వారి సమస్యలపై పోరాడుతుంది. - రైతులు ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు తుళ్లూరు మండలం నుంచి కూడా కొందరు రైతులు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఒక రైతును కరకట్ట లోపలో తనకున్న 12 ఎకరాల పొలం ఇవ్వాలని అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆ రైతు ఒత్తిడిని తట్టుకోలేక హృదయ విదారకంగా విలపిస్తున్నాడు. ఆయన భార్య కూడా బ్రెయిన్ వ్యాధితో బాధపడుతోంది. ఎంబీబీఎస్ చదివే కొడుకుని పిలిపించారు. రైతు కుటుంబం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఆయన్ను భూమి కోసం ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి ఎన్నో సమస్యలు రోజురోజుకీ రైతు పరిరక్షణ కమిటీ దృష్టికి వస్తున్నాయి. కొన్ని గ్రామాల వారు ఈ కమిటీని అక్కడికే రమ్మని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులందర్నీ కమిటీ కలిసి వారి బాధలు వింటుంది. వైయస్ఆర్‌సీపీ లీగల్ టీమ్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందిజేస్తామని దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు.