సీఎం వైయస్‌ జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ

టికెట్ల ధర, సినీ ఇండస్ట్రీ సమస్యలపై కీలక చర్చ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ ప్రారంభమైంది. ముందుగా నటులు పోసాని కృష్ణమురళీ, అలీ, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సినీ హీరోలు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్‌రెడ్డి తదితరులు సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. 

ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్న సినీ ప్రముఖులు సీఎం వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా టికెట్ల ధర, ఇతర అంశాలపై సినీ ప్రముఖులు  సీఎం వైయస్‌ జగన్‌తో చర్చిస్తున్నారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 
 

తాజా వీడియోలు

Back to Top