టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ  

తిరుప‌తి మేయ‌ర్ శిరీష

దాడుల‌కు నిర‌స‌న‌గా తిరుప‌తిలో మ‌హిళ‌ల ఆందోళ‌న‌

తిరుప‌తి: టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ  అని తిరుప‌తి మేయ‌ర్ శిరీష అభివ‌ర్ణించారు. కాలకేయుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయుత్యాలపై నిరసన తెలియజేస్తూ తిరుపతి లో డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఆర్కే రోజాపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడారని త‌ప్పుప‌ట్టారు. రోజా మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించారా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఇష్టానుసారంగా మాట్లాడతారా?. రోజా మీద చేసిన వ్యాఖ్యలు మీ ఇంట్లో ఆడవారి మీద చేస్తే మీరు ఊరుకుంటారా? అని దుయ్యబట్టారు.

గతంలో బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న వంటి వారు రోజాపై అసభ్యకరంగా మాట్లాడారు. విజయమ్మ, భారతమ్మ గురించి ఐటీడీపీ వాళ్లు దారుణంగా ట్రోల్ చేశారు. మహిళలంటే టీడీపీకి గౌరవం లేదు. ఉప్పాల హారికపై దాడి మరువక ముందే ఆర్కే రోజా మీద అసహ్యంగా మాట్లాడుతున్నారు. మహిళా మీద దాడి జరిగితే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?. భాను ప్రకాష్ తాట ఎందుకు పవన్‌ తీయలేదు’’ అంటూ శిరీష‌ నిలదీశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి, మ‌హిళా విభాగం నాయ‌కురాళ్లు పాల్గొన్నారు.

Back to Top