గాయపడిన హఫీజ్‌కు వైయస్‌ జగన్ పరామర్శ

 పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా

 పులివెందుల: మున్సిపల్‌ నామినేషన్ల రోజున పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివెందుల మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌ను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ ద్వారా పరామర్శించారు. హఫీజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. హఫీజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు మనోధైర్యం కల్పించారు. 

Back to Top