వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు లోకేష్‌రెడ్డి అరెస్ట్‌

సీతారాంపురం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు 

నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురంలో వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు చింతం రెడ్డి లోకేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీటీసీ అభ్యర్థికి సంబంధించిన బీ-ఫామ్‌ అందజేస్తున్న సమయంలోనే ఆయనను అరెస్ట్‌ చేయడం రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అరెస్ట్‌కు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సీతారాంపురం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. లోకేష్‌రెడ్డి అరెస్ట్‌కు సంఘీభావంగా ఉదయగిరి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు భయపడరని, టీడీపీ కుట్రలను తిప్పికొట్టడమే పార్టీ శ్రేణుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Back to Top