మిచౌంగ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

విజ‌య‌న‌గ‌రం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మిచౌంగ్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. మిచౌంగ్ తూఫాన్ దాటికి గుర్ల  మండలంలో గుర్ల గ్రామంలో పొలాల్లో ఉన్న వరి పంట నీట మునుగుంది .నీటిలో మునిగిన వరి పంట , దిబ్బలను  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయ‌న వెంట పలాస నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు  కె.వి.సూర్యనారాయణ రాజు(పులిరాజు), జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పిటిసి శీర అప్పలనాయుడు,(జె.సి.యస్ మండల కన్వీనర్* బెల్లాన బంగారునాయుడు, వైస్ ఎంపీపీ తోట తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు మధుసూదన్ రావు, సర్పంచ్ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top