లోకేష్‌.. ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌

తాడేపల్లి: ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఏపీ ఎవరంటే అది నారా లోకేష్‌ మాత్రమే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొండా రాజీవ్‌ మీడియాతో మాట్లాడారు. 
సీఎం వైయస్‌ జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాగే మాట్లాడతే లోకేష్‌కు గుణపాఠం తప్పదన్నారు. లోకేష్‌వి పనికి మాలిన మాటలు. ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదన్నారు. నారా లోకేష్‌ బాడీ లాంగ్వేజ్‌ అభ్యంతరకరంగా ఉందన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా లోకేష్‌ ప్రవర్తన ఉందని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉండేందుకు లోకేష్‌కు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. లోకేష్‌కు వచ్చేది పచ్చి బూతుల భాష మాత్రమే అన్నారు. సీబీఎన్‌ అంటే చంద్రబాబు బూతుల నాయుడు అని పెట్టుకోండి అని సలహా ఇచ్చారు.  ఆంధప్రదేశ్‌ అని స్పష్టంగా రాయలేని వ్యక్తి లోకేష్‌. లోకేష్‌ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. 

 బాబుకు పుత్రోత్సాహం లేదు.. 
    ఏ తండ్రయినా పుత్రోత్సాహానికి ఉప్పొంగిపోతాడు...కానీ చంద్రబాబుకు మాత్రం పుత్రోత్సాహం స్థానంలో లోకేశ్‌ వంటి తనయుడి వ్యవహారశైలి, అసమర్థత, అజ్ఞానం, బూతు పురాణంతో నిత్యం కుమిలికుమిలిపోతున్నాడు. లోకేశ్‌ తీరు ఎంత ఛండాలంగా ఉందో అతని పాదయాత్ర నిరూపిస్తోంది. ఇతని బూతు మాటలు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడుతుంటే... ఇతనొక బూతేష్, ఒక బోకేష్‌...ఎందుకూ పనికిరాని పప్పు...తుప్పు..అని జనం పగలబడి నవ్వుకుంటున్నారు.  లోకేశ్‌ ఒక అజ్ఞాని. ఇతనికి చదువబ్బలేదు. రాజకీయాల్లో పనికిమాలిన వాడిగా మిగిలిపోయాడు. నోరు విప్పితే సైకిల్‌ పోవాలని తాను నినాదాలు చేస్తూ...జనంతోనూ అవే నినాదాలు చేయిస్తూ ... టీడీపీ విధ్వంసానికి తానే భస్మాసురుడిలా మారిన అర్భకుడు... ఆంధ్రాలో పాదయాత్రలు చేయాలని తండ్రి చెబితే కర్ణాటకలో చేస్తాడు ఈ తెలివిలేని దద్దమ్మ. 

బూతుల నాయుడు- బూతుల పార్టీః 
        ఇలాంటి అసమర్ధుడి పాదయాత్ర ఎంత హాస్యభరితంగా ఉందంటే ఇతను మాట్లాడే బూతులు, భావప్రకటన, బాడీ లాంగ్వేజ్‌ను చూసి ... జనం ఇలాంటి చేతకాని దద్దమ్మ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడని నవ్విపోతున్నారు.  సభికుల్లో ఒకరు తనను ఏదో అడిగితే... దానికి ఇతని సమాధానం చేతిని అసభ్యంగా ఊపుతూ కనిపించిన ఈ వీడియో దృశ్యమే నిదర్శమంటూ  లోకేశ్ హావభావాలకు సంబంధించిన ఆ వీడియో క్లిప్పింగ్‌ను రాజీవ్ గాంధీ మీడియా ముందు ప్రదర్శించారు.   
-  ఆ సభకు వచ్చిన మహిళలు, మీడియా ముందు ఇలా అసభ్యంగా మాట్లాడడానికి, అసభ్యకరంగా చేతులు ఊపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది లోకేశ్‌...? అని ప్రశ్నిస్తున్నాను. 
- ఇలాంటి పప్పు చేసే ప్రసంగాల నుంచి జనం ఏం నేర్చుకోవాలి? పైగా ....రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డి గారిని ఏకవచనంతో  సంబోధించడం.. ఇదేనా నీ తండ్రి బాబు నుంచి నువ్వు నేర్చుకున్న సంస్కారం?. మాట్లాడితే..  బట్లర్‌ ఇంగ్లీష్‌ మాట్లాడతాడు. 
- ఇలాంటి దిక్కుమాలిన పుత్రుణ్ని కన్నందుకు సీబీఎన్‌ను చంద్ర బూతుల నాయుడు అని, టీడీపీని తెలుగు బూతుల పార్టీ అని పిలవాలి. 

బూతేష్‌...బోకేష్‌..స్టూలేష్‌...
        ఇన్ని బూతులు మాట్లాడే లోకేశ్‌ను బూతేష్‌ అని, బోకేష్‌ అని పిలవాలేమో...ఈ పనికిమాలిన  వాడు చేసే దిక్కుమాలిన  హెచ్చరిక ఏంటంటే మూత్రం పోయిస్తాడంట... ఇదేనా నీవృత్తి  అని అడుగుతున్నాం.  ఎందుకీ దిక్కుమాలిన మాటలు? నీకు భాషా సంస్కారం, భావ ప్రకటనా సంస్కారం లేవు. నీ వెర్రిమొర్రి మాటలకు మైకు ఇవ్వడం లేదంటూ పోలీసులపై నిందలేస్తావు? మైకు ఇవ్వలేదని స్టూలుపై నిల్చుని మాట్లాడే నిన్ను స్టూలేష్‌ అనాలేమో...

ఇంట్లో వాళ్ళే పట్టించుకోవడంలేదుః
         లోకేశ్ పాదయాత్ర.. అతని ఇంట్లో వారికే నచ్చలేదనడానికి ఉదాహరణ ఏంటంటే... నువ్వు 200 కి.మీ. నడిచిన తర్వాత గాని నిన్ను చూడ్డానికి నీ భార్య బ్రాహ్మణి రాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆ సాకుతో సాయంత్రానికి పాదయాత్ర వాయిదా వేశావు. కాస్త ఎండ కాస్తేనే పాదయాత్ర చేయలేని నిన్ను ఐరన్‌లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌  అని జనం పిలుస్తున్నారు.  నీభాషా జ్ఞానం చూస్తే నువ్వు పాదయాత్రకే అనర్హుడివి అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అని రాయలేని శుంఠః
         చివరికి నీకొడుక్కి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు, నీ భాషా జ్ఞానం ఎంత హీనంగా ఉందో బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌ అని రాయడమే తెలియని నువ్వు ఆంధ్రాలో పాదయాత్రకు అర్హుడివా...?. నీవు ఒక శుంఠవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడివా..?. నీ బతుక్కి నీకు అన్నీ వైఫల్యాలే...తండ్రిగా విఫలమయ్యావు. రాజకీయనాయకుడిగా ఎప్పుడో విఫలమయ్యావు. మంత్రిగా విఫలమయ్యావు. ఇలాంటి నువ్వు జగన్‌ గారిని విమర్శిస్తావా?

ఆర్కే గారిపై ఓడిన నువ్వు పిల్లివిః
-  పిల్లి ఎవరు? పులి ఎవరు?. ఓడిన వాడిని పిల్లి అంటారు. మంగళగిరిలో జగన్ గారి పెట్టిన అభ్యర్థి ఆర్కేగారిపై ఓడిన నువ్వు పిల్లివి. జగన్‌ గారు 151 స్థానాలతో అఖండ విజయం సాధించిన పులి. ఆయన్ని విమర్శిండమంటే ఆకాశంపై ఉమ్మేస్తే నీ మొహంపైనే పడినట్లే. జగన్‌ గారి కాలిగోటిలో మట్టికి కూడా నీవు సరిపోవు. ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు. లేదంటే జనమే నిన్ను పిచ్చికుక్కలా ఛీకొట్టి ఇంటికి పంపిస్తారు. బూతులు మాట్లాడడం ఆపి, భూమ్మీద ముందు నిలబడడం నేర్చుకో.  లోకేశ్‌ను బాడీ షేమింగ్‌ చేయడం లేదు. జనం ముందుకు వెళ్ళినప్పుడైనా సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నా...

 యువతకు అండగా జగన్ గారుః
- ముఖ్యమంత్రి జగన్‌ గారు అధికారంలోకి వచ్చాక,  ఒక్క సచివాలయాల్లోనే 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. 25 ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన డీఎస్సీని పరిష్కరించి, వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి, 53 వేల మందిని ప్రభుత్వోద్యోగులుగా చేశారు.  నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నది ముఖ్యమంత్రి జగన్‌ గారు మాత్రమే. 

బాబు లాంటి కులతత్వ నాయకుడితో పోలికా
రాష్ట్రంలో సొంత అజెండా లేని పవన్‌..  చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ ఆయన చెప్పిన మాటలనే వల్లెవేస్తాడు. బాబు అజెండా కోసమే పవన్‌ పనిచేస్తాడు. కులాల మంటల్లో చలికాచుకునే తత్వం బాబుది. కులాలను ఏకం చేసే విశాల హితం జగన్‌ గారిది . బాబు లాంటి కులతత్వ నాయకుడితో జగన్‌ గారికి పోలికా?.
- కాపులపై అక్రమంగా కేసులు పెట్టింది చంద్రబాబు. వాటన్నిటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసివేయించింది జగన్‌ గారు. ఇంతకన్నా కాపుల పట్ల ఉదారత చూపే నాయకుడు ఎవరుంటారు. 
 
పెట్టుబడులకు విశాఖ స్వర్గధామంః
- పెట్టుబడులు, పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రదేశమైనా,  ప్రతిపక్షం లేనిపోని దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రభుత్వం కృషి వల్ల అనేక పరిశ్రమలు విశాఖ రాబోతున్నాయి. ఈ క్రమంలోనే మార్చిలో విశాఖలో పరిశ్రమల సదస్సును ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారు. పెట్టుబడులకు విశాఖ స్వర్గధామం కాబోతోంది. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే జగన్‌ గారి లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు ఆయన అహర్నిశలూ కృషి చేస్తారు.. అని కొండా రాజీవ్‌ గాంధీ తెలిపారు. 

Back to Top