రెడ్‌బుక్ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ నిర్వీర్యం

 
తాడేప‌ల్లి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం న్యాయ వ్యవ స్థను కూడా ఖాతరు చేయడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో బుధవారం పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక కేసులో నిందితుడు శివయ్యను న్యాయవాది కోర్టులో సరెండర్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తే మేజిస్ట్రేట్ సరెండర్ పిటిషన్లపై చెక్ అండ్ పుట్ అప్ అని కోర్టు సిబ్బందిని ఆదేశించార న్నారు. అయితే చిప్పగిరి ఎస్ఐ సతీష్, పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ మరి కొంతమంది పోలీ సులు సివిల్ డ్రెస్లో వచ్చి కోర్టు హాల్లో ఉన్న నిం దితుడు శివయ్యను బయటకు లాక్కెళ్లేందుకు యత్నించగా.. అడ్డుకున్న న్యాయవాది జె.రవి కుమార్ను సైతం పక్కకు తోసేసి దురుసుగా ప్రవ ర్తించడం సరికాదన్నారు. న్యాయస్థాన ప్రాంగణం లో ఉన్న సరెండర్ అయిన నిందితులను అరెస్ట్ చేయకూడదని తెలిసినా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే తమ చేతుల్లోకి తీసుకుని న్యాయ వ్యవ స్థను అగౌరవ పరిచారన్నారు. ప్రజాస్వామ్య వాదులు, న్యాయవాదులు, ప్రజలంతా ముక్తకం ఠంతో ఈ ఘటనను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Back to Top