శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి 
 

నంద్యాల‌: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు..  శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నిండుకుండలా జలకళను సంతరించుకుంది. శ్రీశైలం డ్యాం వరదనీటితో గరిష్ఠ స్థాయికి చేరువలో ఉంది. దీంతో జలాశయం 3 క్రస్ట్ గేట్ల‌ను కొద్దిసేప‌టి క్రితం మంత్రి అంబ‌టి రాంబాబు ఎత్తారు.  ఇన్ ఫ్లో రూపంలో ప్రస్తుతం 1,27, 980 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతుండ‌గా.. ఔట్ ఫ్లో 74,365 క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది.. మరోవైపు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. కాగా, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. దీంతో..   శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ‌కు నీరు విడుద‌ల చేశారు.  కార్య‌క్ర‌మంలో నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top