తెలుగు సరిగా రానివాళ్లు కూడా మాట్లాడటం హాస్యాస్పదం

  తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి

నెల్లూరు జిల్లా:  తెలుగు సరిగా రానివాళ్లు కూడా తెలుగు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ అండ్ కో ఇకనైనా అర్ధం పర్థం లేని పిచ్చి మాటలు మానుకోవాలని  హితవు పలికారు.. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మతిలేని వాళ్లు రాసిన స్ర్కిప్ట్‌ను వాళ్లు చదువుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో తెలుగు భాషకు ఇప్పుడు సరైన పునాది పడుతోంది. ప్రైవేట్‌ స్కూళ్లలో తెలుగును తప్పనిసరి చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయ పునరుద్ధరణ జరగబోతోందని, ఏపీలో తెలుగు భాషకు నిజమైన పట్టం కట్టబోతున్నామని లక్ష్మీ పార్వతి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top