లగడపాటివి దొంగ సర్వేలు

హెరిటేజ్‌ అభివృద్ధికే చంద్రబాబు అధికారాన్ని వాడుకున్నారు

మహిళలను కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత చంద్రబాబుదే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుపతి: కచ్చితంగా  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. లగడపాటివి దొంగ సర్వేలంటూ మండిపడ్డారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్‌ను అభివృద్ధి చేయడానికే అధికారాన్ని చంద్రబాబు వాడుకున్నారని నిప్పులు చెరిగారు.మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత చంద్రబాబుది అని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top