కర్నూలు: లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ధనుంజయ్ రెడ్డి , కృష్ణ మోహన్ రెడ్డి ను సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. మద్యం కేసులో రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ధనుంజయ్ రెడ్డి ,కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలులో మీడియాతో మాట్లాడారు. `ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇష్యూను డైవర్ట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. మద్యం లో స్కాం జరిగిందంటు సంబంధం లేని వారి మీద కేసులు పెడుతూ భయపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడే పరిస్థితి లేదు , న్యాయం కోసం పోలీసు స్టేషన్లను ముట్టడించడానికి వెనుకాడం. హామీలు అమలు కాక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల తరపున పోరాటానికి సిద్దంగా ఉన్నాం` అంటూ ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.