సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన కుప్పం టీడీపీ నేత‌లు

అన్న‌మయ్య జిల్లా: కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేర‌కు వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. 

Back to Top