వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం

18–45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌

తాడేపల్లి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 18 నుంచి 45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాల‌ని అధికారులను ఆదేశించారు. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాల‌ని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేర‌కు కోవిడ్ వ్యాక్సిన్ల ఆర్డ‌ర్ పెట్టాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top