బాధిత కుటుంబాల‌కు అండ‌గా నిలిచిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

పెద్దాపురం ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ప‌రిహారం అంద‌జేత‌

ఒక్కో కుటుంబానికి రూ.50 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం

చెక్కులు అందించిన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ సీదిరి అప్ప‌ల‌రాజు 

కాకినాడ‌: ఇటీవల కాకినాడ జిల్లా పెద్దాపురం ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన ఏడుగురు కుటుంబాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌గా నిలిచారు. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు పెద్దాపురం వ్యక్తులు కాగా.. మిగిలిన ఐదుగురు గిరిజన వ్యక్తులు కాగా..ఆ కుటుంబాల‌ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షలు , హ్యూమ‌న్‌ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి వచ్చిన రూ.25 లక్షలు మొత్తం కలిపి ఒక్కొక్క కుటుంబానికి రూ.50 లక్షలు చెక్కులను బాధిత కుటుంబాలకు శుక్ర‌వారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రివర్యులు ,కాకినాడ ఇంచార్జ్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా అందించారు.  కార్యక్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి క‌న్న‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా,  ఎంపీ గీత, కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్యియ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top