పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి

శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టిన కార్మిక శాఖ మంత్రి జయరాం
 

 

అమరావతి: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. నిరుద్యోగ యువతీయువకులకు ఆశా కిరణం అయిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయాన్ని అమలులో భాగంగా ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించాలని సభ్యులందరినీ మంత్రి జయరాం కోరారు. అంతకు ముందు మంత్రి జయరాం మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మంది నిరుద్యోగులను కలిశారని, వారి స్థితి గతులు మార్చేందుకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.

Back to Top