పల్నాడు జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ బస్సుయాత్రకు జననీరాజనం 

రొంపిచెర్ల, సంతగుడిపాడులో జనప్రభంజనం

మండుటెండనూ లెక్కచేయని జనం.

ప‌ల్నాడు:  ‘మేమంతా సిద్ధం యాత్రలో 12వ రోజు బుధ‌వారం ప‌ల్నాడు జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఎండలోనూ జననేతపై అభిమానం ఉప్పొంగింది. మేమంతా సీఎం వైయ‌స్ జగన్‌ వెంటే అంటూ ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా రోడ్ల‌పై నిన‌దించారు. స్కూల్‌ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటప‌డ్డారు.  కొందరు మహిళలు, వృద్ధులు తమ కష్టాలు చెప్పుకోగా.. వాటిని సావధానంగా విన్న సీఎం వైయ‌స్ జగన్‌.. ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో మమేకమయ్యారు. మండే ఎండలో సీఎం వైయ‌స్ జగన్‌ను చూసేందుకు ఓ అవ్వ రోడ్డు పైకి రాగా.. సీఎం ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ‘పది కాలాల పాటు చల్లంగుండు నాయనా’ అంటూ ఆమె ఆశీర్వదించింది.
అడుగడుగునా వైయ‌స్‌ జగన్‌ పాలనకు మద్దతు తెలుపుతూ జనం కదం తొక్కారు. ఇంటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి.. చేతిలో పథకాలను పెట్టిన నాయకుడి వెంటే మేమంతా అంటూ జనం ఎలుగెత్తిచాటారు. ప‌ల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధమంటూ ప్ర‌జాభిమానం కదం తొక్కింది.అభిమాననేత కోసం రోడ్లపైనే బారులు తీరిన అవ్వాతాతలు, పసిపిల్లలతో సహా తల్లులు.
పలుచోట్ల బస్సు నుంచి కిందకు దిగి..అందరినీ ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం వైయస్‌.జగన్‌.
రొంపిచర్ల మండలం విప్పర్లలో జనసునామీ క‌నిపించింది. నడినెత్తిన ఎండనూ లెక్కచేయని మహిళలు.
హారతులుతో సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు.
దారిపొడువునా ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ కోసం వేచిచూస్తూ... బస్సుయాత్రకు మేమంతా సిద్ధమంటున్న జనం.
నకరికల్లు మండలం చల్లగుండ్ల జనసంద్రంగా మారిన రోడ్లు.
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా కదం తొక్కిన జనం.
గుమ్మడికాయలతో దిష్టితీసిన అక్కచెల్లెమ్మలు.
దారిపొడవునా ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు.

 

జగనన్నపై అభిమానం.. అడ్డురాలేదు వృద్ధాప్యం

ప్రశ్న: మీ పేరు చెప్పండమా..?

వృద్ధురాలు: రాధమ్మ

ప్రశ్న: ఏ ఊరమ్మా మీది?

వృద్ధురాలు: ఈ ఊరే (రొంపిచెర్ల)

ప్రశ్న: మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు?

వృద్ధురాలు: ఎక్కడికి..ఇక్కడికా? సారు జగన్ సారు గారు వస్తున్నారంటే ఆ జనంలో రాలేక నాకు ఓపిక లేక ఇక్కడకు వచ్చి ఒంటరిగా కలుద్దామని..

ప్రశ్న: ఆహా..మీరు ఇంత ఎండలో ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు?

వృద్ధురాలు: జగన్ మోహన్ రెడ్డి గారిని కలవాలని, ఆయన అభిమానంగా వచ్చా

ప్రశ్న: మీకు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందమ్మా? మీకు పెన్షన్ గానీ అవన్నీ వస్తున్నాయా?

వృద్ధురాలు: ఆ..మాకు అంతా బాగానే ఉందయ్యా

ప్రశ్న: ఇప్పుడు మీరు ఓటు ఎవరికి వేశారమ్మా?

వృద్ధురాలు: ఓటు జగన్ మోహన్ రెడ్డి గారికే వేస్తాం, వేస్తాం మా దరిమిన వేయిస్తాము కూడా..

ప్రశ్న: ఎందుకు.. జగన్ మోహన్ రెడ్డి గారికే ఎందుకు వేస్తారు?

వృద్ధురాలు: ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వేస్తారు.. 

Back to Top