నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం  

  చిత్తూరు: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జగనన్న క్రీడా సంబరాలు-2022 మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు.   చిత్తూరు జిల్లా నుంచి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాలకు చెందిన క్రీడాకారులు క్రీడా సంబ‌రాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గాల వారు , నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం ఆనందంగా భావిస్తున్నాని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృధి కి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం వైయ‌స్ జ‌గ‌న‌న్న‌అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేక పోవడం, వారికి కావలసినది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు, భజన అంటున్నారన్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు ..ఇది భజన అంటూ వ్యంగంగా మాట్లాడారు. 
క్రీడలు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగుపడుతుందని, క్రీడలు అనేవి ఆరోగ్యాన్ని ఇస్తాయని, మంచి జోష్ తీసుకువస్తాయన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పోర్ట్స్ లో ముగ్గురికి గ్రూప్ వన్ పోస్ట్ లు వచ్చాయని, చదువు ఎంత ముఖ్యమో, స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేశామని, డిసెంబర్ 21 నాడు సీఎం వైయ‌స్ జగన్ అన్న పుట్టిన రోజు నాడు విజేతలకు అవార్డులు అందిస్తామ‌ని, ఆ రోజు జగనన్న చేతిలో అవార్డులు తీసుకునే వాళ్ళు మీలో ఎంతమంది అని ఆమె అన్నారు. అలాగే.. క్రీడా కారులను ఉత్సాహపరుస్తూ క్రీడా శాఖ మంత్రి రోజా స్వయంగా క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఆట‌లు ఆడారు.   
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప చిత్తూరు జే.సి. వెంకటేశ్వర్, డిఇఓలు విజయేంద్ర, శేఖర్, ఆర్డీఓ సృజన, ఎంఆర్ఓ చంద్రశేఖర్, మునిసిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి, సెట్విన్ సిఇఓ మురళీకృష్ణ మేనేజర్ మురళి, నగరి నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు,  కౌన్సిలర్ లు,  పంచాయితీ సర్పంచులు, ఎంపీటీసీలు  పాల్గొన్నారు.
   

Back to Top