క్రోసూరు బయల్దేరిన సీఎం వైయ‌స్ జగన్ 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే తాడేప‌ల్లి నుంచి ప‌ల్నాడు జిల్లా క్రోసూరుకు బ‌య‌లుదేరారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే ప్ర‌భుత్వం విద్యాకానుక అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది సీఎం వైయ‌స్ జగన్‌ ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేయనున్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.

Back to Top