11.02 లక్షల మంది విద్యార్థుల విద్య‌కు భరోసా

నేడు విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో రూ.694 కోట్ల `విద్యా దీవెన‌` న‌గ‌దు జ‌మ‌

తాడేపల్లి: పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యం దిశ‌గా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేర‌కు విద్యారంగంలో అనేక విప్ల‌వాత్మ‌క‌ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. విద్య కోసం అనేక ప‌థ‌కాల‌నూ అమ‌లు చేస్తున్నారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌రికాసేప‌ట్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి పెండింగ్‌
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫీజులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. రెండేళ్ల తర్వాత కూడా బకాయిలు చెల్లించిన సందర్భాలు అనేకం. అప్పట్లో ఇచ్చేది రూ.35 వేలే అయినా ఆ మొత్తమూ సకాలంలో అందక కాలేజీల యాజమాన్యాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ప్రభుత్వమిచ్చే రూ.35 వేలు పోగా, మిగతా మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో సీఎం వైయ‌స్ జగన్‌ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమల్లోకి తెచ్చి విద్యార్థులపై భారం లేకుండా చేసింది. దీంతో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అటు కళాశాలల యాజమాన్యాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ బకాయిలు రూ.1,778 కోట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.

కాలేజీల్లో లోపాలుంటే ప్రశ్నించే హక్కును కల్పిస్తూ..
ఫీజు నిధులు ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాక.. వారే కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. తద్వారా ప్రతి తల్లి తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే వీలు కల్పించింది. ఆయా కాలేజీల్లో  లోపాలుంటే ప్రశ్నించే హక్కును కూడా వారికి కల్పించింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top