27న శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటన 

శ్రీకాకుళం : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి టూర్‌ షెడ్యూల్‌ను వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుతారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో మాట్లాడుతారు.

ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ నుంచి బయల్దేరి కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. 11.25 నుంచి 11.45 వరకు సభావేదికపైన అతిథుల ప్రసంగం ఉంటుంది. 11.45 నుంచి 11.55 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. 11.55 నుంచి 12.40 వరకు సీఎం ప్రసంగిస్తారు. 12.40 నుంచి 12.45 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు బటన్‌ నొక్కుతారు.

12.45కి బయలుదేరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2.30గంటలకు చేరుకుంటారు. అనంతరం సీఎం నివాసానికి 2.40 గంటలకు చేరుకుంటారు.    

Back to Top