ఢిల్లీ: రఘురామకృష్ణరాజు అనర్హత పిటీషన్‌పై లోక్‌సభ స్పీకర్ నివేదిక కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైయస్‌ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. వైయస్‌ఆర్ సీపీ పిటీషన్‌ను పరిశీలించిన స్పీకర్.. ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు.