అన్నింటా మహిళలకు పెద్ద పీట

హోం మంత్రి మేకతోటి సుచరిత
 

విజయవాడ:  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవులు, పనుల్లో మహిళలకు అన్నింటా పెద్ద పీట వేశారని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందజేసే విధంగా ఎక్కడ లేని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు.  మంత్రి వర్గ కూర్పు నుంచి నామినేటెడ్‌ పదవుల వరకు మహిళలకు పెద్ద పీట వేశారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వడం, దళితులకు గతంలో ఒకటి రెండు పదవులు మాత్రమే కేబినెట్‌లో దక్కేవి. ఈనాడు ఐదు పోస్టులు ఇచ్చారు. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించారు. గుర్తింపు లేని వర్గాలకు గుర్తింపు తెస్తూ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 50 శాతం పదవులు మహిళలకే కేటాయించారు. దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూసే విధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ..సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top