గుర్రం జాషువా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి

సామాజిక రుగ్మతలను సాహిత్యం ద్వారా ఎత్తి చూసిన ధీశాలి

జాషువా రచనలు సమసమాజానికి బాటలు వేశాయి

గుర్రం జాషువాను కొనియాడిన వైయస్ఆర్‌సీపీ నేతలు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా వర్ధంతి 

గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైయస్ఆర్‌సీపీ నేతలు

తాడేపల్లి:  చరిత్రకారుడు, కవి, సాహితీవేత్త, అణగారిన వర్గాల అణచివేతలపై తన సాహిత్యంతో సమరం చేసిన సామాజికవేత్త గుర్రం జాషువా వర్దంతిని తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అధ్యక్షతన గుర్రం జాషువా విగ్రహానికి పార్టీ నేతలు, మాజీ మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే డా.తిప్పేసామి, ఆదిమూలపు సతీష్, ఈర లక్కప్ప, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మందపాటి శేషగిరిరావు, నలమారు చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ ..గుర్రం జాషువా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సాహిత్యం ద్వారా ఆనాటి సామాజిక రుగ్మతలను ఎత్తి చూపడంతో పాటు వాటి నిర్మూలనకు ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు జాషువా అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

గుర్రం జాషువా కళాపీఠం పనులను పూర్తి చేయాలి:   మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

పద్మభూషన్ గుర్రం జాషువా వంటి మహానుభావులు ఆనాడే సామాజిక అసమానతలపై పోరాటం చేశారు. దళితులు పడుతున్న బాధలు, కులవివక్షతతో వారు అనుభవిస్తున్న ఆవేదనను సాహిత్యరూపంలో ఆయన సమాజం ముందు పెట్టారు. విశ్వనరుడిని నేను అని చాటుకున్న గొప్ప సంస్కర్త. అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలని అయన కన్న కలలను తన పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్. కవికోకిల గుర్రం జాషువా స్మృతులను స్మరించుకునేందుకు గుంటూరు నడిబొడ్డున రూ.3 కోట్లతో కళాపీఠంను ఏర్పాటు చేసేందుకు ఆనాడు సీఎంగా వైయస్ జగన్ అన్న అనుమతులు ఇచ్చారు. ఆ కళాపీఠంలో ఒక లైబ్రరీ, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక హాల్‌ను నిర్మించేందుకు కూడా శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీనిని బట్టే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్‌కు దళితులు, అణగారిన వర్గాల పట్ల ఉన్న చులకనభావం అర్థమవుతోంది. వెంటనే గుర్రం జాషువా కళాపీఠం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గుర్రం జాషువా సాహితీపురస్కారం, గుర్ర జాషువా జీవన సాఫల్య పురస్కారాలను కొనసాగించాలి. 

సామాజిక అసమానతలపై గళమెత్తారు:  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్

గబ్బిలం, ఫిరదౌసీ, స్వేచ్ఛ, సమానత్వం ఇలా అనేక రచనల ద్వారా అంటరానితనం, సామాజిక వివక్షతలపై గుర్రం జాషువా గళమెత్తారు. ఆయన రచనల్లోని ఆవేదన నేటి కూటమి పాలనలో దళితులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత వైయస్ఆర్‌సీపీ పాలనలో దళితులు, అణగారిన వర్గాలు లభించిన స్వేచ్ఛను నేడు కూటమి ప్రభుత్వం హరించి వేస్తోంది. దళితుల ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. కనీసం దళితులను మనిషిగా కూడా చూడని దుర్బరమైన పరిస్థితిని నేడు అనుభవిస్తున్నారు. ఈ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని దళితులు ఎదురుచూస్తున్నారు. దళతుల జీవితాల్లో వెలుగులు నింపిన వైయస్ జగన్ పాలనను నేటికీ తలుచుకుంటున్నారు. 

 వైయస్ జగన్ పాలనను కోరుకుంటున్నారు:   మాజీ మంత్రి సాకె శైలజానాథ్

గుర్రం జాషువా ఆలోచనా విధానం సమాజంలో అసమానతలను పారద్రోలడానికి, అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో పురోగతిని సాధించడానికి ఆనాడు బీజాలు వేశాయి. ఆయన అందించిన స్పూర్తితో అనేక మంది సంస్కర్తలు, పాలకులు వివక్ష లేని సమాజం కోసం కృషి చేశారు. ఆనాడు డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తరువాత ఆయన తనయుడు వైయస్ జగన్ తన పాలనలో అణచివేత, దౌర్జన్యాలు, వివక్ష లేని సమాజాన్ని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేశారు. గొప్ప మార్పుకు నాంధి పలికారు. చంద్రబాబు వంటి దళిత వ్యతిరేక భావజాలంతో నలిగిపోతున్న బడుగులకు బాసటగా నిలిచారు. నేడు కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న దుర్మార్గాలను చూస్తున్న దళితులు మళ్ళీ వైయస్ జగన్ పాలనను కోరుకుంటున్నారు. 

తన రచనలతో సమాజంలో సజీవంగా నిలిచిపోయిన సాహితీవేత్త :   కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుర్రం జాషువా ఒక సాహితీవేత్తగా సమాజానికి అందించిన సందేశాన్ని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాలి. 
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రచనల ద్వారా చిరస్థాయిగా సమాజంలో సజీవంగా నిలిచిపోయారు. ఆయన ఏదైతే ఆశించారో దానిని ఆచరణలోకి తీసుకువచ్చిన గొప్ప పాలన వైయస్ జగన్ హయాంలో ప్రజలు చూశారు. 

 సామాజిక అసమానతలపై పోరాడిన సాహితీమూర్తి :    వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు

ఆయన గబ్బిలం అనేది చారిత్రాత్మక కావ్యం. సామాజిక అంశాలపై ఆయన సంధించిన ప్రశ్నలు అనేక మందిని ఆలోచింపచేశాయి. సాహిత్యం ద్వారా బడుగుల పక్షాన ఉద్యమించిన మహనీయుడు. అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే సమాజం వికాసం వైపు పయనిస్తుందని నమ్మిన వ్యక్తి గుర్రం జాషువా. విద్యతో, చైతన్యంతోనే అణగారినవర్గాలు ప్రగతిని సాధిస్తాయని ఆయన నమ్మారు. ఆయన ఆనాడు ఏదైతే చెప్పారో అదే ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్. సమాజంలోని పేదరికాన్ని, అసమానతలను పారద్రోలేందుకు విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మిన నాయకుడు వైయస్ జగన్. అందుకే ఆయన పాలనలో విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. గుర్రం జాషువా వంటి మహనీయులు చూపించిన బాటలో వైయస్ జగన్ వంటి నాయకులు నడవడం వల్లే సమాజంలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి.

Back to Top