తిరుమల లడ్డూ పై బాబుది దుర్మార్గమైన ప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం

దేవాలయాలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయం

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు

చంద్రబాబు దుర్మార్గాన్ని భక్తులు, దైవం కూడా క్షమించరు

ఈ పాపం అనుభవించక తప్పదు

స్పష్టం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేప‌ల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

అధికారంలో వచ్చినప్పటి నుంచి బాబు కక్షసాధింపులు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను వేధించడమే బాబు ఏకైక అజెండా

తన అనుకూల మీడియా ద్వారా బురద జల్లే తప్పుడు కధనాలు

ఏదో జరుగుతుందనేలా ప్రజల్లో అపోహలు

తన మోచేతి నీళ్లు తాగే అధికారులతో సిట్ దర్యాప్తు

ఇదే చంద్రబాబు మోడెస్ ఆపరెండీ

తేల్చి చెప్పిన అంబటి రాంబాబు

అధికారంలోకి రాగానే తిరుమల లడ్డూపై బాబు అబద్ధాలు

లడ్డూలో జంతు కొవ్వు అంటూ అసత్య ప్రచారం

దీనిపై సీబీఐ విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణకు సుప్రీం ఆదేశం

దేవుడిని రాజకీయాలకు వాడుకోవద్దంటూ సుప్రీం కోర్టు చురకలు

అయినా తీరు మారని చంద్రబాబు

వైవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా ఎల్లో మీడియాలో అసత్య కథనాలు

ఇది ముమ్మూటికీ కక్ష సాధింపే 

అందులో భాగంగా సుబ్బారెడ్డి  పీఏ  చిన అప్పన్న అరెస్టు

ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు

చిన అప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్, ప్రశాంతరెడ్డిల దగ్గర కూడా పీఏగా చేశారు

మరి వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు

కిలో నెయ్యి రూ.320 కే కొంటే అది కల్తీ అన్న చంద్రబాబు

స్వచ్చమైన నెయ్యి కిలో రూ.3వేలు అంటూ ప్రకటనలు

కిలో రూ.1600 ఉంటుందని ఈనాడులో కధనాలు

ఇప్పుడు రూ.1000 లోపే కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం

ఇది కల్తీ నెయ్యి కాదా ?

సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

తాడేపల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దేవాలయాలను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  ఏడాదిన్నర కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి వేధించడమే ఏకైక అజెండాగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది తేల్చి చెప్పారు. తనకున్న మీడియా బలంతో తాను లక్ష్యంగా చేసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద పుంఖాను, పుంఖాలుగా తప్పుడు కధనాలు రాయించి.... ఆ తర్వాత విచారణ పేరుతో తన మోచేతి నీళ్లు తాగే అధికారులతో సిట్ ఏర్పాటు చేసి.. అరెస్టు చేయడం పరిపాటిగా మారిందని.. ఇదే చంద్రబాబు అనుసరిస్తున్న మోడెస్ ఆపరెండీ అని  అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం దేవుడ్ని కూడా వాడుకుని, తిరుమల లడ్డూ ప్రసాదం పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు, ఆ దేవుడు కూడా క్షమించరని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...
 
● రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకుంటున్న నీచుడు..

తన అనుకూల అధికారులతో సిట్ వేసి విచారణ పేరుతో ఎవరో ఒకరిని పట్టుకుని బెదిరించి.. తాను లక్ష్యంగా చేసుకున్నవైయ‌స్ఆర్‌సీపీ నేతల పేర్లను చెప్పాలని వేధిస్తున్నారు. అవసరమైతే వారిని కొట్టి మరీ తనకు కావాల్సిన వారి పేర్లు చెప్పిస్తున్నారు. ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ఈ  రకమైన మోడెస్ ఆపరెండీ ని అమలు చేస్తున్నారు. మీడియాను వాడుకుంటూ.. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడు. చివరకు దేవాలయాలను సైతం తన నీచమైన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుని, రాజకీయం చేసే నీచమైన పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. ప్రపంచంలోనే హిందువులకు అతి పవిత్రమైన, విశిష్టమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన అదృష్టం. అది భగవంతుడి ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో నెలకున్నారని భక్తుల విశ్వాసం. ఆ దేవదేవుడిని దర్శించుకోవాలని, అక్కడి ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భావిస్తుంటారు. కానీ చంద్రబాబు రాజకీయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకుండా పోయింది. నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకుని... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద నిరంతరం బురద జల్లే రాజకీయం చేస్తున్నారు.

● నెయ్యి ట్యాంకులను వెనక్కి పంపామన్న ఈవో శ్యామలరావు...
 
చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని టీటీడీ ఈవో గా నియమించారు. ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యతపై టీటీడీలో చాలా పక్కాగా పరీక్షలు నిర్వహిస్తారు. సుదీర్ఘ కాలంగా దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్ద ఉంది. కాంట్రాక్టర్ వద్ద నుంచి వచ్చిన నెయ్యి నాణ్యత నిర్ధారణలో భాగంగా తనిఖీ చేస్తారు. వాటి శాంపుల్స్ ని లేబ్ కి పంపిస్తారు. అక్కడ నాణ్యతపై అనుమానం ఉంటే మరోసారి పరీక్ష నిర్వహిస్తారు.  అప్పుడు కూడా ఆ నెయ్యి నాణ్యతపై అనుమానం ఉంటే... దాన్ని తిరుమల కొండ మీద చేరక ముందే వెనక్కి పంపిస్తారు. ఒకవేళ నెయ్యి తిరుమల కొండ మీదకు చేరిందంటే.. అన్ని పరీక్షల్లో ఈ నెయ్యి స్వచ్ఛమైనదని తేలినట్టే లెక్క. అప్పుడు లడ్డూ తయారు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. ఆ విధానంలో భాగంగానే 12 జూన్  2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే... ఆ టైంలో ఈవో గా ఉన్న శ్యామలరావు గారు నెయ్యి ట్యాంకర్లను పరీక్షించగా.. అందులో వనస్పతి కలిసిందేమోనన్న అనుమానాలను ఎన్ డీ డీ బీ వాళ్లు వ్యక్తం చేస్తూ.. ఇది పూర్తిగా వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు అని డిస్ క్లైమర్ కూడా రాశారు. ఈ నెయ్యి ట్యాంకులను తిప్పి వెనక్కి పంపించామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. 

● ప్రసాదాల్లో వాడేశామంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు..

అయినా కూడా చంద్రబాబు  సెప్టెంబరు 18న ఆ నేతిని వాడారు అని చెప్పారు. దానిలో జంతువులు కొవ్వు, పంది కొవ్వు ఉంది.. ఈ నేతిని వాడి లడ్డూ ప్రసాదం తయారు చేశారు. భక్తులు ఆ ప్రసాదం కూడా తిన్నారని మాట్లాడారు. ఎంత దుర్మార్గం. ఇదే మాట ఈవో శ్యామలరావు గారెని అడిగితే ఆ నెయ్యిని వెనక్కి పంపించామని చెప్పారు. రాజకీయ కక్ష కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబుకి దేవుడన్నా కూడా లెక్కలేదు.  వైయస్.జగన్ మీద, వైయ‌స్ఆర్‌సీపీ మీద బురద జల్లడం, దేవుడ్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా, అన్యాయంగా దుష్ప్రచారం చేయడమే ప్రధాన ధ్యేయంగా తప్పుడు మాటలు మాట్లాడిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.
ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరూ ముక్కుమీద వేలేసుకున్న పరిస్థితి. వాడని నెయ్యిని వాడారని చెప్పడంతో పాటు, నెయ్యిలో పశువులు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని అన్యాయంగా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను భక్తులందరూ అపవిత్రంగా భావించారు.

● సుప్రీం కోర్టులో చంద్రబాబుకి చురకలు...

దీనిపై తీవ్ర ఆవేదన చెందిన టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ విచారణలో అసలు వాడని నెయ్యిని వాడినట్లు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారని కోర్టు చీవాట్లు పెట్టింది. దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే.. దాన్ని కూడా వెనక్కి పంపించామని చెబితే.. జంతువులు కొవ్వు వాడామని ఒక ముఖ్యమంత్రి ఇలా ఎలా చెప్తారంటూ కోర్టు చురకలు పెట్టింది. ఇలా మాట్లాడకూడదని చెప్పి.. విచారణ జరిపించాలని కోరింది. సీబీఐ విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి కోరితే.. సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ వేసి దర్యాపు చేయాలని ఆదేశిస్తూ... భగవంతుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని.. వీటికి దూరంగా పెట్టాలని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లో లాగొద్దని .. కేవలం నెయ్యిలో కల్తీ కలిసిందా?లేదా? అన్నది తేల్చండని చెప్పంది.

● తీరు మారని చంద్రబాబు..

అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అవన్నీ వదిలేసి.. ఈ కేసులో ఎవరి మీద కక్ష తీర్చుకుందామన్న పనిలో పడింది. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డిపై దుష్ప్రచారం చేస్తూ తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం మొదలుపెట్టారు. తమ వేధింపుల కోసం ముందుగా ఒక వ్యక్తిని ఎంచుకున్నట్టు ఈ కేసులో కూడా చిన అప్పన్నను పట్టుకుని మే నెలలో విచారణకు పిలిచారు. సిట్ అధికారులు జూన్ 6 న విచారించారు. వెంటనే చిన అప్పన్న ఒక వీడియో విడుదల చేసి... విచారణలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పేరు చెప్పమన్నారు. సిట్ అధికారులు తనపై దౌర్జన్యం చేశారు అని చెప్పారు. సిట్ అంటే చంద్రబాబు ఆడించినట్టు ఆడే సంస్థ. 
రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఇష్యూ జరిగి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే... మరలా తెరపైకి తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకురావడం చంద్రబాబుకి ఆయన కుమారుడికి అలవాటుగా మారింది. దీంతో మరలా చిన అప్పన్నను అరెస్టు చేసి.. సుబ్బారెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం మరలా మొదలు పెట్టారు. ఇంతవరకు నెయ్యి లో కల్తీ జరిగిందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని పరీక్షలకు కూడా పంపించకుండానే కల్తీ జరిగింది... ఈ పాపం వైయస్.జగన్ దే అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుర్మార్గంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. 

చిన అప్పన్న 2018 వరకు వైవీ సుబ్బారెడ్డి దగ్గర పీఏగా పనిచేశారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దగ్గర పనిచేశారు. మరి వాళ్ల పేర్లు ఎందుకు భయటపెట్టడం లేదు? కారణం వాళ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నారు.. వారి పార్టీ తరపున ప్రజా ప్రతినిధులు కాబట్టి.. వాళ్ల పేర్లు పత్రికల్లో రాయలు. సిట్ లో వారి పేర్లు కూడా ప్రస్తావించరు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. టీటీడీలో పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారధి గారు ఆ రోజు పర్చేజింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే సౌరభ్, చెన్నైకు చెందిన కృష్ణమూర్తి కూడా పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు..వీరి అనుమతితోనే ప్రసాదానికి కావావల్సిన ముడి సరుకులు కొనుగోలు చేస్తారు. వీళ్లందరినీ వదిలిపెట్టి వైయ‌స్ఆర్‌సీపీ లో కీలకమైన నాయకుడు కాబట్టి.. సుబ్బారెడ్డిని మాత్రమే టార్గెట్ చేసింది. ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. 

● ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తున్న నెయ్యి కూడా కల్తీనా బాబూ...?

గతంలో చంద్రబాబు మాట్లాడుతూ స్వచ్ఛమైన నెయ్యి కేజీ రూ.3వేలు, కానీ రూ.320  ఏంటి?  ఇది కల్తీ అన్నారు. ఈనాడు లో అయితే కేజీ రూ.1600 నుంచి రూ.1000 ఉంటుంది. అలా కాకుండా రూ.320కే కొంటే అది కల్తీ నెయ్యి అని తేల్చారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు రూ.3వేలకు కేజీ కొంటున్నారా? ఈనాడు చెప్పినట్లు రూ.1600 కు కొంటున్నారా అంటే అదీ లేదు. కేజీ రూ.1000 లోపే కొంటున్నారు. మరి ఇది కల్తీ నెయ్యి కాదా?  2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో కొన్న నెయ్యి కేజీ రూ.276 మాత్రమే. 

● తండ్రీకొడుకులను దేవుడు కూడా క్షమించడు..

కానీ తమ రాజకీయాల కోసం వైయ‌స్ఆర్‌సీపీపై బురద జల్లడానికి, హిందువులను మా పార్టీకి దూరం చేయడానికి దుర్భిద్ధితో తండ్రీకొడుకులు దుష్ర్పచారం చేస్తున్నారు. దైవం అంటే నమ్మకం ఉంటే.. కలవని కల్తీని కలిసిందని చెప్పి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, నీచమైన రాజకీయం చేస్తూ.. చంద్రబాబు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం చాలా బాధాకరం. పవిత్రమైన లడ్డూ కోసం ఉద్దేశించిన నెయ్యి తిరుమలకు చేరకముందే పరీక్ష చేసి... అంతా సవ్యంగా ఉంది అన్నప్పుడే కొండ మీద లడ్డూ తయారీకి పంపిస్తారు. ఇది ఏళ్ల తరబడి కొనసాగుతున్న పటిష్టమైన వ్యవస్థ ఉండగా... ఇంత దుర్మార్గంగా పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు దుర్మార్గమైన ప్రచారం చేశారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ఆ భగవంతుడు కూడా క్షమించడు. 

నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? దాని మీద దర్యాప్తు చేయండి అని సుప్రీం కోర్టు చెబితే.. దాన్ని పక్కన పెట్టి వైయ‌స్ఆర్‌సీపీలో ఎవరి మీద కక్ష సాధింపు చేద్దాం? ఎవరిని అరెస్టు చేసి జైల్లో పెడదాం అన్నదే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ లక్ష్యంగా మారింది.  బోలే బాబా డెయిరీ పాలసేకరణపై భిన్నాభిప్రాయాలు రాస్తున్నారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టు వచ్చిన బోలే బాబాకి పాలసేకరణే లేదని ఒకసారి, మరోసారి పాలసేకరణ అద్భుతంగా చేస్తున్నారని వాళ్లే రాస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో 60వేల మంది పాడి రైతుల నుంచి సేకరిస్తున్నారను ఒకసారి రాస్తూ... మరోసారి పాలవ్యాపారంతో సంబంధం లేదని రాస్తూ తప్పటడుగులు వేస్తున్నారు. కేవలం వైస్సార్సీపీని వైయస్.జగన్ ని బదనామ్ చేయాలన్న దురుద్దేశ్యంతోనే దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలతో పాటు ఆ దైవం కూడా క్షమించరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఈ పాపాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు.

Back to Top