ఎన్టీఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నందిగామ నియోజకవర్గంకు చెందిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గుంటుపల్లి సి.ఎ. కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు డాక్టర్ జానకి ప్రియ, ప్రణయ చంద్రా రెడ్డి లకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.