విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన నడుస్తోందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. గురువారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను మేయర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే అన్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన జోగి రమేష్‌పై అక్రమ కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. 18 నెలలుగా నిద్రపోతున్న కూటమి ప్రభుత్వం... అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. జోగి రమేష్‌ను అక్రమంగా జైల్లో బంధించి తాత్కాలిక సంతోషాన్ని పొందుతున్న టిడిపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని మేయర్ హెచ్చరించారు.