క‌ర్నూలు ఎయిర్ పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

 కర్నూలు:  నంద్యాల‌లో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు  క‌ర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇవాళ జ‌గ‌నన్న వ‌స‌తి దీవెన కింద‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్‌ నొక్కి సీఎం వైయ‌స్‌ జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదిక కానుంది.  వైయ‌స్ జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఎమ్మెల్యేలు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, హ‌ఫీజ్‌ఖాన్‌, సుధాక‌ర్‌, క‌ర్నూలు మేయ‌ర్ బీవై రామ‌య్య‌, ఎంపీ సంజీవ్‌కుమార్‌, త‌దిత‌రులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top