ఆప్కో భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవం

హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి గౌతమ్‌రెడ్డి

విజయవాడ: ఆప్కో భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యం ఉన్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే అభివృద్ధి అన్నారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ క్రియేట్‌ చేస్తామని చెప్పారు. 

భారతీయతకు గుర్తింపు చేనేత అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేతన్నల ఆత్మహత్యలను నిలుపుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయంతో చేనేతలు నిలబడే ప్రయత్నం చేయాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top