విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు