సంక్షేమ పథకాలతో ప్ర‌జ‌ల్లో సంతోషం 

ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

జ‌గ్గ‌య్య‌పేట‌: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల ప్ర‌జ‌ల్లో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతున్నాయని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను  పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణం 2వ సచివాలయం 5వ వార్డు నందు బుధవారం రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు.కానీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రజలకు మంచి చేయడమే ద్వేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.

 కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,కౌన్సిలర్ వట్టెం మనోహర్, సాదుపాటి రాజు,దువ్వల రామకృష్ణ,ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు పెంటి శ్రీనివాస్,జిల్లా పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి రాంబాబు,వార్డ్ నాయకులు గరిక తిరుపతయ్య,కొమ్మూరి కొండ,సిద్దినేని నాగు, అన్నేపాక రమేష్,వరాలు,మల్లా రామారావు,బిగుమల్ల పుల్లరావు,మహిళా నాయకులు బెంబవరపు కృష్ణకుమారి,అడపా రమణి,పగడాల బుజ్జి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top