ప్రజలపై ప్రేమ ఉంటే లూటీ చేసిన రూ.3 లక్షల కోట్లు పంచాలి

చంద్రబాబుపై ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ధ్వజం

తూర్పుగోదావరి: కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌, మంత్రులు, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. ప్రాణాలకు తెగించి ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నామన్నారు. కానీ ఇనాళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుతిన్న టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దాకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. కాకినాడలో ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను తాను జూమ్ యాప్‌ సీఎంగా ప్రమోట్ చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంపై, రాష్ట్రంలోని ప్రజలపై ప్రేమ లేని చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ప్రేమ ఉన్న గత ఐదేళ్లలో లూటీ చేసిన రూ.3 లక్షల కోట్లు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు పంచాలని డిమాండ్‌ చేశారు. పొరుగు రాష్ట్రంలో దాక్కున్న చంద్రబాబుకు ఆంధ్రరాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేంద్రం మూడు లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తే.. మన రాష్ట్రం లక్ష కిట్లు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. దీన్ని బట్టే కరోనా నివారణకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తుందో ప్రజలకు అర్ధమవుతోందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top