`కేంబ్రిడ్జ్`తో ఉపాధ్యాయులు, విద్యార్థుల‌కు శిక్ష‌ణ‌ 

కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్న ప్ర‌భుత్వం

తాడేప‌ల్లి: ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం పెంపొందించే చర్యల్లో భాగంగా మున్సిపల్‌ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం శిక్షణ అందించనుంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, ఏపీ పట్టణాభివృద్ధిశాఖ మధ్య అవగాహన ఒప్పంద పత్రం కుదుర్చుకుంది. ఈ మేర‌కు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సౌత్‌ ఏషియా రీజనల్‌ డైరెక్టర్‌ టి కె అరుణాచలం అవ‌గాహ‌న ఒప్పందాల‌పై సంత‌కాలు చేసి ప‌త్రాలు మార్చుకున్నారు. కార్య‌క్ర‌మంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఉన్నారు.

Back to Top