రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్ ప్రమాణ స్వీకారం

ప్ర‌మాణం చేయించిన  రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ 

హాజ‌రైన ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి:  రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పదవీ ప్రమాణం చేయించారు.  ఈ వేడుకకు ఆంధ్ర్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రులు,  హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్‌ కార్యాలయ అధికారులు హాజ‌ర‌య్యారు.  

Back to Top