గౌతమ్‌రెడ్డి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి

 మంత్రి ధర్మన కృష్ణ‌దాస్‌
 

అమ‌రావ‌తి:  మంత్రి గౌత‌మ్‌రెడ్డి గొప్ప సంస్కారం ఉన్న వ్య‌క్తి అని మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కొనియాడారు.  గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి రాజకీయల్లో​ ఉన్నతమైన పదవులు సాధించినా ఎప్పుడూ గొప్ప సంస్కారంతో ఉండేవారని  తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరో మూడు దశాబ్దాలు ప్రజా జీవితానికి పనికివస్తాడని తాను భావించేవాడినని గుర్తుచేసుకున్నారు.

► గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఏపీ ఐటీ పాలసీలు చేస్తున్నప్పుడు ‘గౌతమ్‌రెడ్డి అన్న’తో అనేకసార్లు చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు.

గౌతమ్‌రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు: ఆదిమూలపు
►నిరంతరం తపన కలిగిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ గుర్తుచేశారు. కడప జిల్లాఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా గురించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పుడు అక్కడ కూడా గౌతమ్‌రెడ్డి పట్టుదల, కమిట్‌మెంట్‌ చూశామని తెలిపారు.  

► గౌతమ్‌రెడ్డి అకాల మరణం బాధాకరం: ఆనం
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top