అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట 

కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అసెంబ్లీ స‌మావేశాలు

 ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

అమరావతి: సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు చంద్రబాబుకు కనబడటం లేదా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు  శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రఘురామకృష్ణరాజు పని చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు చేయని హడావుడి బాబు ఇప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు వేసిన కమిటీ రిపోర్ట్‌ను కూడా చంద్రబాబు తప్పుపడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Back to Top