ఉత్సాహంగా సాగుతున్న ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ 

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన అభివృద్ధి, ప్రజలకు కలిగిన ప్రయోజనాలు వివరిస్తూ సాగుతున్న ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది.

పేదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు ఇంటింటికీ వెళ్లి వివరించారు. తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలు చేసిందని, రానున్న రెండేళ్లలో మరింత లబ్ధి చేకూరుస్తుందని నాయకులు వివరించారు. 

Back to Top