సున్నిపెంటలో గడప గడపకు మన ప్రభుత్వం

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి ఘ‌న స్వాగ‌తం
 

నంద్యాల‌:  శ్రీశైలం నియోజకవర్గం సుండిపెంట గ్రామంలో 49వ రోజు ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్థానిక పశువుల ఆసుపత్రి వీధి నుంచి ప్రారంభమైన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌తి ఇంటి వ‌ద్ద ఎమ్మెల్యేకు ఎదురెళ్లి స్థానికులు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి పొందిన ల‌బ్ధిని ఎమ్మెల్యేకు వివ‌రిస్తున్నారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే చ‌క్ర‌పాణిరెడ్డి ఈ మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వం నుంచి పొందిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. ఏవైనా స‌మ‌స్య‌లు చెబితే వెంట‌నే ప‌రిష్క‌రిస్తున్నారు.  .

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top