తాడేపల్లి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు శాసనసభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 1. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 2. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 3. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 4. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఈ నలుగురూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వీరిని సస్పెండ్ చేస్తూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.